సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు కాపు కార్పొరేషన్ చైర్మన్, పోలవరం విలీన మండలాల మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు. ఇటీవల సీఎం ని కలిసి తమను బీసీలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు విలీన మండలాల్లోని మున్నూరు కాపులు. వారి విజ్ఞప్తి మేరకు పోలవరం విలిగిన మండలాల్లోని మున్నూరు కాపు కులస్తులను బిసి-డి కింద గుర్తింపు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు మున్నూరు కాపు సంఘం నాయకులు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ ఆడపా శేషు మాట్లాడుతూ.. ముంపు మండలాలలోని కాపులను బీసీ డీలో సీఎం జగన్ చేర్చారని.. తెలంగాణ తరహాలో ముంపు మండలాల్లోని కాపులకు రాష్ట్రంలో బీసీ-డీ సర్టిఫికెట్ ఇస్తున్నారని తెలిపారు. మాకు న్యాయం చేసిన సీఎం జగన్ కు కలిసి ధన్యవాదాలు తెలిపామన్నారు. కాపుల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.
కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రతిపక్ష టిడిపిి వ్యవహరిస్తుందని.. ప్రభుత్వంపై అనవసర అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీ కాపులకు అన్యాయం చేస్తుందన్నారు. కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డున పడేలా చేశారని.. ముద్రగడ పద్మనాభం పై చంద్రబాబు కేసులు పెట్టి వేధించిన విషయం పవన్ కళ్యాణ్ కు తెలియదా? అని ప్రశ్నించారు.