కన్ ఫాం: జగన్ ని అలా.. బాబుని ఇలా.. చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది!

-

పాపం చంద్రబాబును చరిత్రకు పరిమితం చేస్తున్నారు జగన్! నిన్నమొన్నటివరకూ అమరావతి నిర్మాణం అని చెప్పి, ప్రపంచ రాజధాని అని చెప్పి గ్రాఫిక్స్ కి పరిమితమైన చంద్రబాబును మరో విషయంలో కూడా కాగితాల సీఎంగా పరిమితం చేయడంతోపాటు.. తాను చేతల సీఎంగా నిరూపించుకునే పని విషయంలో మరో అడుగు ముందుకేశారు!

అవును… గత ఐదేళ్లు అమరావతి నిర్మాణం, మెట్రో రైలు విషయాలను కాగితాలకు, ప్రెస్ నోట్లకు పరిచయం చేసిన చంద్రబాబు స్థానే.. జగన్ ప్రస్తుతం విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ వేయడంతోపాటు సీరియస్ గా డెసిషన్ తీసుకున్నారు. అవును… చంద్రబాబు హయాంలో 2015 అక్టోబర్ 29న అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. అయితే ఆ ఐదేళ్ల పాటు కేవలం ఫైల్స్ తోనే నడిచింది ఆ వ్యవహారం.

అయితే తాజాగా విశాఖ మెట్రోకు డీపీఆర్ సిద్ధమవుతోందని, నవంబర్ లో టెండర్లు పిలుస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదే సమయంలో నేరం మాది కాదు కేంద్రానిది అని చెప్పే చేతకాని మాటలు కూడా జగన్ సర్కార్ ప్రకటించలేదు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తుందని మరో సంచలన కామెంట్ చెబుతుంది జగన్ సర్కార్!

అనుకున్న పనులు చేయడంలో జగన్ ఎంత మొండోడు అన్నది అందరికీ తెలిసిన సంగతే! కాబట్టి అన్నీ అనుకూలంగా జరిగితే విశాఖలో నాలుగు కారిడార్లుగా 75.31 కిలోమీటర్ల పరిధిలో మెట్రో నిర్మాణం కాబోతోందన్న మాట! సో… ఇక చంద్రబాబు కేవలం కాగితాల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోబోతుండగా.. జగన్ మాత్రం చేతల సీఎంగా చరిత్ర భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోనున్నాయన్నమాట!!

Read more RELATED
Recommended to you

Latest news