సైకో తరహా నిర్ణయాలతో ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తుంది – చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీలో రహదారులపై రోడ్డు షోలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా నియంత్రించేలా తెచ్చిన ఈ జీవో పై ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా మండిపడ్డాయి.

ఈ నేపథ్యంలోనే ఆ జీవోను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆశ్రయించగా.. ఆ జీవోను నిలిపివేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జీవో నెంబర్ 1 పై జోక్యం చేసుకోలేమని అభిప్రాయపడింది. అంతేకాదు ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ముగిస్తున్నామని ప్రకటించింది.

సుప్రీం తీర్పు పై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సుప్రీం నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది అన్నారు. హైకోర్టులో విచారణ ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సైకో తరహా నిర్ణయాలతో ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తుందని మండిపడ్డారు చంద్రబాబు. జీవో నెంబర్ 1 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news