బాప్‌ ఆఫ్‌ ఆల్‌ ఎపిసోడ్స్‌.. పవన్‌ కల్యాణ్‌ ఆన్‌స్టాపబుల్ అప్డేట్ వచ్చేసింది..

-

ఎప్పుడెప్పుడా అని ఎదురచూస్తున్న బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్‌ను ఆహా విడుదల చేసింది. ఇన్నాళ్లు మాస్ యాక్షన్ నటనతో వెండితెరపై అలరించిన నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చింది అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షో. తనదైన సరదా మాటలతో.. కామెడీ పంచులతో యాంకరింగ్‏కు కొత్తదనం తీసుకువచ్చారు. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కాగా.. ఇక ఇప్పుడు రన్ అవుతున్న సీజన్ 2 బ్లాక్ బస్టర్ హిట్. సినీ, రాజకీయ ప్రముఖులతో బాలయ్య చేసే ఇంటర్వ్యూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇప్పటికే చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, శర్వానంద్, అడివిశేష్ వచ్చి సందడి చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ గురించి చెప్పక్కర్లేదు. డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకు రికార్డ్స్ బద్దలయ్యాయి. అయితే.. ఈ మాసివ్ ఎపిసోడ్‏కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు మరో ఎపిసోడ్ కోసం ఆడియన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అదే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్‌..

ఇప్పటికే పవన్.. బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ కూడా సోషల్ మీడియాను వైరల్‌ అయ్యాయి. అయితే.. ఈ రోజు రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఆహా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. దీంతో అందరూ ఎనిమిది ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news