ఏపీలో మరో హామీ పథకం రాబోతుంది. ఏపీ ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు హామీలు ఇవ్వడం జరిగింది. తాజాగా ఇచ్చిన హామీలను అమలు చేసే పనిచేసే పనిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 25 కోట్లతో చేనేత కార్మికులకు ఆరోగ్య భీమా పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే ఆరోగ్య భీమాను అమల్లోకి తీసుకువస్తామని అనౌన్స్ చేశారు.
అయితే ఈ భీమాకు సంబంధించి ఐసీఐసీఐ లాంబార్డ్ బీమా సంస్థ ప్రతిపాదనలను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరానికి ఒక్కో కుటుంబం రూ. 2,100 ప్రీమియం చెల్లిస్తే పథకాన్ని అమలు చేస్తామంటూ ప్రభుత్వానికి తెలియజేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీల మేరకు ఒక్క కుటుంబానికి సంవత్సరానికి రూ. 10,000 వరకు ఉచితంగా….ఓపిడి సేవలు అందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలకు ఈ బీమా వర్తిస్తుంది. ఈ శుభవార్త విన్న చేనేత కార్మికులు సంతోషంలో ఉన్నారు.