చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు : సజ్జల

-

చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. ఎన్నికల్లో మేము గెలుస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నెగిటివ్ ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు సజ్జల.

చంద్రబాబు కుట్ర పూరితంగా కేంద్రం సహాయంతో కొందరూ అధికారులను తప్పించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి పై దాడి గురించి ఈసీకి ఫిర్యాదు చేశామని.. ఈసీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ పథకం అందలేదో చెప్పండి. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోలేము. సీఎం జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని తెలిపారు. కూటమి నేతలు రాష్ట్రమంతా అతలాకుతలమవుతుందని దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news