చంద్రబాబు సంచలనం..టీడీపీ వ్యూహకర్తగా పీకే టీమ్‌ నియామకం !

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత కొన్ని ఏళ్ల నుంచి తెలుగు దేశం పార్టీకి వ్యూహ కర్తగా రాబిన్‌ వర్మ ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ బాధ్యత నుంచి ఆయన తప్పుకున్నారు. రాబిన్‌ శర్మ స్థానంలో.. ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌ మాజీ సభ్యుడు సునీల్‌ చేబ్రోలు తో.. చంద్రబాబు నాయుడు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

సునీల్‌ టీమ్‌ పనితీరు నచ్చితే.. ఒప్పందాన్ని పొడిగించానే యోచనలో చంద్రబాబు ఉన్నారని కూడా తెలుస్తోంది. తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్ఠాలిన్‌ నేతృత్వరంలోని డీఎంకే కు పని చేసిన టీమ్‌ లో సునీల్‌ కూడా ఉన్నారు. మరోవైపు రాబిన్‌ శర్మ కూడా ప్రశాంత్‌ కిశోర్‌ కు చెందిన ఐ ప్యాక్‌ లో పని చేశారు. చాలా కాలంగా ఆయన తెలుగు దేశం పార్టీ కోసం పని చేశారు. వాస్తవానికి రాబిన్‌ శర్మ పనితీరు.. పట్ల చంద్రబాబు సంతృప్తిగానే ఉన్నప్పటికీ… ఆయన టీమ్‌ పట్ల అంసతృప్తిని వ్యక్తపరిచారు. ఇక ఈ మార్పుతో.. తెలుగుదేశం బలంగా మారుతుందో చూడాలి.