తమరికి ఆ నైతిక అర్హత లేదేమో బాబు గారు!

ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు అసలు ఆ అర్హత.. కనీస అర్హత, నైతిక అర్హత మనకు ఉన్నాయా లేదా అని ఆలోచించుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమవుతున్నారు! అందుకు ఉదాహరణగా నిలిచింది తాజా జూం మీటింగ్! అందుకు భాగమైంది స్థానిక సంస్థల ఎన్నికలపై బాబు డిమాండ్!

అవును… ఇప్పుడు ఏపీలో టీడీపీ ఉన్న పరిస్థితి అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు. అయితే… జగన్ ఎలాగూ ఎన్నికలు వద్దంటున్నారు కాబట్టి ఈ సమయంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే పోలే… అని భావించారో ఏమో కానీ… స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు అని సీరియస్ అయిపోతున్నారు బాబు!

సరే బాబు ప్రస్తుత ధైర్యం గురించి కాసేపు పక్కన పెడితే… గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2018కే గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసిపోయింది. అయినా కూడ నాడు కరోనా లేదు ఏమీ లేదు… అయినా కూడా ఎన్నికలు ఎందుకు పెట్టలేదు! ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది!

సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఈ ఎన్నికలు పెడితే.. బాబు బండారం బయటపడుతుందని అప్పట్లో తమ్ముళ్లు తెగ టెన్షన్ పడ్డారు. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల మాటే చంద్రబాబు ఎత్తలేదు! మరి ఈ కరోనా సమయంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం కష్టం అని చెబుతున్నా కూడా ఎందుకు చంద్రబాబు కి ఈ తుత్తర? అనేది నెటిజన్ల ప్రశ్న!

కాబట్టి.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహన గురించి ఎవరైనా మాట్లాడొచ్చు కానీ.. చంద్రబాబు మాత్రం కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఆ పని చేసి ఉంటే… నేడు జగన్ ని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు.. కరోనా గురించి ప్రజలను ఈ సమయంలో ఇబ్బందిపెట్టనవసరం లేదు!! అర్ధమవుతుందా..??