పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2019-2024 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించింది. నా మీద చిన్నప్పుటి నుంచి ఒక్క కేసు కూడా లేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక నాపై 17, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారు. పవన్ రోడ్డు మీద పడుకుని నిరసన తెలియచేసే పరిస్థితి కల్పించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారు చంద్రబాబు. “ఆయన ఏం చేసుకున్నా చట్టబద్దంగా చేసుకున్నాడు. నువ్వు (జగన్) కూడా తెగ కలవరిస్తున్నావ్ కావాలంటే పోయి కాపురం చెయ్యవయ్యా అన్నా నేను కూడా” అని గుర్తు చేశారు చంద్రబాబు. వ్యక్తి గతంగా తీసుకురావద్దని చాలా సందర్భాల్లో చెప్పినట్టు వెల్లడించారు. ఏ వ్యక్తి కూడా వేరే మహిళలతో.. ఏ మాత్రం కూడా వాళ్ల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ప్రయత్నం చేయకండి. ఎవ్వరైనా సరే.. సోషల్ కూడా కూడా మహిళల మనోభావాలు దెబ్బతినేవిధంగా పోస్ట్ లు చేయవద్దని సూచించారు. ఎవడైనా సరే.. ఆడబిడ్డలపై అసభ్యంగా దెబ్బ తీసేవిధంగా మాట్లాడితే.. అలాంటి వారిని వదిలి పెట్టనని హెచ్చరించారు.