నకిలీ విత్తనాలపై చంద్రబాబు సంచలన నిర్ణయం

-

నకిలీ విత్తనాలపై చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై చర్యలకు వెనుకాడొద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని చంద్రబాబు హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్లో వేసే పంటలకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

వరి, మొక్కజొన్న, కందులు, పెసర్లు, పత్తి,చిరుధాన్యాలు, ఉద్యాన పంటల రైతులకు అండగా నిలబడాలని ఏపీ సీఎం సూచనలు చేశారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్నకు ఆదేశించారు. భూసార పరీక్షలకు కేంద్రం రూ. 20 కోట్లు కేటాయించిన సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. ఖరీఫ్ సీజన్లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news