చంద్రబాబు సర్కార్ పై వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. అమరావతి మెట్రో కోసం విశాఖ మెట్రో ఆపారు చంద్రబాబు. మెట్రోకు మళ్లీ చంద్రబాబు సర్కార్ మోకాలడ్డు పెట్టిందని పేర్కొంది వైసీపీ. వైజాగ్ మెట్రో ప్రాజెక్టుని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నిందని తెలిపింది వైసీపీ.
మరోసారి డీపీఆర్ తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ఇప్పటికే కేంద్రానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంపింది. సమగ్ర దూరదృష్టితో నివేదిక సిద్ధం చేసింది. 76 కిలోమీటర్ల లైట్ మెట్రో కారిడార్ నిర్మాణానికి రూ.14,309 కోట్లు ఖర్చు అయింది.
ఇప్పుడు కొత్త డీపీఆర్ పేరుతో టీడీపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ముందు అమరావతిలో మెట్రో రైలు తీసుకురావడమే లక్ష్యమని.. టీడీపీ ముందుకు వెళుతోందని వైసీపీ ఆరోపణలు చేసింది. ఇదయ్యేవరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా మెట్రో లేనట్టేనని వైసీపీ పేర్కొంది.