విశాఖ డ్రగ్స్ పై కేసుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో డ్రగ్స్ పట్టుకున్నారు…25 వేల కిలోల డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ తెచ్చారన్నారు చంద్రబాబు. సీబీఐ వస్తే పోలీసు అధికారులు జాప్యం చేసే ప్రయత్నం చేశారు…టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తే.. దాని మీద చర్యలే లేవని నిలదీశారు. పైగా టీడీపీ మీదే తప్పుడు కేసులు పెట్టారని..ఐదేళ్లల్లో ఒక్కసారైనా సీఎం జగన్ డ్రగ్స్, గంజాయి మీద సమీక్షే చేయలేదని ఆగ్రహించారు.
కాకినాడ ఎమ్మెల్యే ప్రమేయంతో డ్రగ్స్ రవాణ జరుగుతోందని చెప్పామని…బ్రెజిల్ ప్రెసిడెంటుకు అభినందనలు తెలుపుతూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసినట్లు ఫైర్ అయ్యారు. బ్రెజిల్ ప్రెసిడెంటుతో ఈయనకు సంబంధం ఉంది.. విజయసాయి ప్రధాని స్థాయి వ్యక్తి కదా..? అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నారని మండిపడ్డారు. నేరం వైసీపీ నేతలు చేసి.. నేరం టీడీపీ మీద మోపుతున్నారని ఆగ్రహించారు. అక్రమ సంపదను విదేశాలకు తరలిస్తున్నారు….ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆక్వా ఎక్సపోర్ట్ కంపెనీకి ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని అంటున్నారు.. దీన్ని సీబీఐ తేల్చాలని డిమాండ్ చేశారు.