ఏపీలో పెన్షన్లు అస్సలు తగ్గించబోమన్నారు సీఎం జగన్. అనకాపల్లి నర్సీపట్నం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, పెన్షన్లు తగ్గిస్తున్నారన్న దానిపై వివరణ ఇచ్చారు. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఆడిట్ లో భాగంగా నిబంధనల ప్రకారం వెరిఫికేషన్ నోటీస్ లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని.. కేవలం నోటీస్ లు ఇచ్చినందుకు ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.
చంద్రబాబు ప్రభుత్వం 39 లక్షలు ఇస్తే మేం 62 లక్షల కు పెంచామని.. జనవరి 1 నుంచి సామాజిక పెన్షన్లు 2750 రూపాయలు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. డ్రోన్ షూటింగ్ కోసం చిన్న గొంది లోకి తీసుకెళ్ళి 8 మంది చంపేశారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు సీఎం జగన్. ముఖ్యమంత్రి గా కూడా షూటింగ్ కోసం గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేశారు.. ఇచ్చిన ప్రతీ మాటా నిలబెట్టుకుంటామన్నారు. మీరు గర్వంగా చెప్పుకునే విధంగా మీ జగనన్న నాయకత్వం ఉంటుంది.. రాజకీయం అంటే షూటింగ్ లు కాదు, డైలాగ్ లు కాదు, డ్రామాలు అంతకన్నా కాదని చురకలు అంటించారు.