మామూలోళ్ళు కాదు : తక్కువ పెట్రోల్ వచ్చేలా బంకుల్లో చిప్స్ !

-

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెట్రోలు బంకుల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధునాతన చిప్స్ ఏర్పాటు చేసి, మోసాలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్ బంకుల్లో తక్కువ పెట్రోలు వచ్చే విధంగా ఎలక్ట్రానిక్ చిప్స్ అమర్చుతున్నట్టు ఈ సంధర్భంగా వారు గుర్తించారు. జిల్లాలో మొత్తం ఏడు పెట్రోల్ బంకుల్లో చిప్స్ అమర్చినట్లు తేలింది. దీంతో జిల్లాలోని మిగిలిన పెట్రోల్ బంకుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చిప్స్‌ అమర్చే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమోట్‌ ఆధారంగా పెట్రో చౌర్యానికి పాల్పడుతున్నారు.

భూగర్భంలో ఉన్న నిల్వ కేంద్రం నుంచి పెట్రోలు పంపు నుంచి వాహనంలోకి చేరుతుంది. పంపు నుంచి ఎంత మొత్తంలో చమురు వస్తుందో కొలిచే పరికరాల వద్ద రిమోట్‌ చిప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. లీటరు పెట్రోలుకు ఎన్ని మిల్లీలీటర్లను తగ్గించాలన్నది ముందుగానే సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రోగ్రామింగ్‌ చేస్తారు. పైకి రీడింగ్‌లో అంతా సవ్యంగానే కనిపిస్తుంటుంది. కానీ తెరమాటున దోపిడీ యథేచ్ఛగా సాగిపోతుంది. చమురు సంస్థల అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు మాత్రం రిమోట్‌ ద్వారా ఆ చిప్‌ పని చేయకుండా నిలిపివేతున్నట్టు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news