ఎర్ర జెండాల వారికి… చంద్రబాబు ఆత్మీయ కామ్రేడ్ : సీఎం జగన్

-

ఉపాధ్యాయులు, ఇతర వర్గాల ఆందోళన పై ఇవాళ సీఎం జగన్ స్పందించారు. ఈ నేపథ్యంలోనే.. ప్రతిపక్షాల తీరు పై నిప్పులు చెరిగారు సీఎం జగన్. ఎర్ర జెండాల వారికి ఆత్మీయ కామ్రేడ్ గా చంద్రబాబు తయారయ్యారని చురకలు అంటించారు. ప్రపంచ కమ్యునిస్టు చరిత్రలో ఎప్పుడూ కనివినీ ఎరుగని విధంగా కమ్యునిస్టులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

బాబు బినామీలు, రియల్ ఎస్టేట్ వారి కోసం కమ్యునిస్టులు ఎర్ర జెండాలు పట్టుకున్నారని.. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు భూములు కేటాయిస్తే అడ్డుకున్నారని ఆగ్రహించారు. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేశారని.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ప్రభుత్వం, ప్రజలు ,ఉద్యోగులు ఎవరూ కోరుకోవడం లేదని పేర్కొన్నారు.

పచ్చ జెండా ముసుగులో ఉన్న ఎర్రజెండా వారిని చంద్రబాబు ముందుకు తోశారని.. ఆశా వర్కర్లు రోడ్లపైకి వచ్చారని… ఆందోళన చేస్తున్నారని రాస్తున్నారని పచ్చ మీడియాపై ఫైర్‌ అయ్యారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ వారి ఆందోళనలకు కమ్యునిస్టులు మద్దతిస్తున్నారని.. మెరుగైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెండాలు పట్టుకుని ఆందోళనలు చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news