గ్రామ సచివాలయాలకు సీఎం జగన్‌ తీపికబురు..

గ్రామ సచివాలయాలకు సీఎం జగన్‌ తీపికబురు చెప్పారు. గడప గడపకు కార్యక్రమంపై సీఎం రెండో సారి సమీక్షించారని… గడప గడపకు కార్యక్రమంలో మరింత ఎక్కువగా తిరగాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. స్థానిక సమస్యల పరిష్కారానికి సచివాలయానికి 20లక్షలు కేటాయించారని.. ఎమ్మెల్యేకు 2కోట్లు చొప్పున నిధులను కేటాయించాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

జూలై 15 లోపు రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని.. ఒకరోజు అటూ ఇటూ లో పనులు పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతులపై ఐదేళ్లలో గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో మూడేళ్లలో మేము ఎంత ఖర్చు చేశామే చర్చకు సిద్దమని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేయకపోవడం వల్లే రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని.. గతంలో హుద్ హుద్ తుపాను వచ్చాక మూడు రోజుల వరకు మంచినీళ్లు కూడా చంద్రబాబు ఇవ్వలేదని ఆగ్రహించారు. గోదావరి వరద బాధితులకు సాయం అందలేదని అనడం అవాస్తవమని.. భవిష్యత్తులో జగన్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు తప్పకుండా రావాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.