ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త… విద్యా కానుక పై కీలక ప్రకటన

-

ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. స్కూల్స్ ప్రారంభమైన రోజు నుంచే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యా కానుక అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.. దీంతో రేపటి నుంచి అన్ని పాఠశాలలో జగనన్న విద్యా కానుకను అందిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స ప్రకటన చేశారు. సుమారు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద స్కూల్ డ్రెస్సులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బ్యాగ్, బెల్ట్, పుస్తకాలు అందజేయనున్నారు అధికారులు.

కాగా,రేపటి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూల్స్ రీ ఓపెన్​పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా రేపటి నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news