శ్రీరామనవమి స్పెషల్.. స్వయంగా రాసి పాట పాడిన రాజాసింగ్

-

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే హైదరాబాద్‌ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తాజాగా గొంతెత్తి గాయకుడిలా మారారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ఆయన తొలిసారి తెలుగులో పాట పాడారు. ఈ పాటను స్వయంగా ఆయనే రాశారు కూడా. నగరంలోని ధూల్‌పేట కేంద్రంగా శ్రీరామ నవమి శోభాయాత్రకు 13 ఏళ్ల క్రితం ఆయన శ్రీకారం చుట్టి దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్శించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా శ్రీరామనవమిని పురస్కరించుకుని శనివారం రోజున ఆయన పాట ట్రైలర్ విడుదల చేశారు. ‘‘ హిందువుగా పుట్టాలి.. హిందువుగా బ్రతకాలి.. హిందువుగా చావాలిరా.. కాషాయ మెత్తాలి ముందడుగు వెయ్యాలి.. పులిలా గర్జించాలిరా తమ్ముడూ..’’ అంటూ ఆయన గొంతెత్తారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పాడిన పాట ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. పూర్తి పాటను ఈ నెల 17వ తేదీన ధూల్‌పేటలోని ఆకాశపురి హనుమాన్‌ ఆలయం వద్ద విడుదల చేసి శోభాయాత్ర ప్రారంభించనున్నట్లు రాజాసింగ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news