పదో తరగతి ఫలితాలపై సీఎం జగన్ కీలక ప్రకటన

-

శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి లో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల విద్యార్థులు 8,9 పరీక్షలు రాయకుండా నేరుగా పదవతరగతి పరీక్షలు రాశారని అన్నారు సీఎం జగన్. అయినప్పటికీ 67% మంది పాస్ అయ్యారని తెలిపారు. గుజరాత్ లో 65 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు అని అన్నారు. ఫెయిల్ అయిన వారికి నెలరోజుల్లోగా సప్లమెంటరీ ఎగ్జామ్ పెడతామని అందులో పాసైనా కంపార్ట్మెంటల్ కాకుండా రెగ్యులర్ గానే పరిగణిస్తామని చెప్పిన ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి అని ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి.

- Advertisement -

విద్య లో క్వాలిటీ ఉండేందుకు మార్పులు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థులలో ఆత్మస్థైర్యం నింపేలా మాట్లాడాలి కానీ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు తానా అంటే దత్తపుత్రుడు తందానా అంటున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దత్త పుత్రుడు ఏకమై ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లుగా చేస్తారని, మోసం చేయడంలో చంద్రబాబు, దత్త పుత్రుడు తోడుదొంగలు అని అన్నారు. వీరిద్దరూ రాజకీయాల్లో ఉండడానికి అర్హులేనా? అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...