పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు అధికారులు. 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం… మొత్తం 21 లే అవుట్లలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.
గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 10 లే అవుట్లలో, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకోనున్నారు. జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవలింగ్ పనులు పూర్తి చేయనున్నారు. ఈ మేరకు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు నిరుపేదల చిరకాల ఇంటి కలను తీర్చే బృహత్త కార్యక్రమమని.. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.