వాళ్లు మనుషులా? పశువులా? – సిపిఐ నారాయణ

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఏడవ రోజు సోమవారం అసెంబ్లీలో జరిగిన ఉద్రిక్తత పై మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఏపీ అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను పట్టుకొని కొట్టడం ఏంటి? వాళ్లు మనుషులా? పశువులా? అంటూ ధ్వజమెత్తారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదన్నారు నారాయణ.

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమితోనే వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తి నిరాశ నిస్పృహలతో ఉందన్నారు. అందుకే అసెంబ్లీలో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిరక్షరాస్యులకు ఓటు హక్కు కల్పించి మరీ దొంగ ఓట్లు వేయించుకున్నారని అన్నారు. గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగింది తప్ప ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదని.. ఇందులో స్పీకర్, సీఎం ఇద్దరిదీ తప్పు ఉందన్నారు. ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నారాయణ. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను శాశ్వతంగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news