బిజెపి చెప్పేది పూజలు, చేసేవి బెదిరింపు రాజకీయాలు : సీపీఐ నారాయణ

-

రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో పని చేస్తామని స్పష్టం చేశారు సిపిఐ కార్యదర్శి నారాయణ. దేశంలో రాజకీయ పార్టీలను భయపెట్టి పాలన సాగిస్తున్న బిజెపికి ప్రజల చేతిలో ఓటమి ఖాయమని తెలిపారు. ఈవీఎం ట్యాంపరింగ్లను నమ్ముకున్న బీజేపీ 400 సీట్లు మాట మాట్లాడుతుందని.. రాష్ట్రంలో జగన్, చంద్రబాబుతో సహా దేశంలో అనేక మంది సీఎంలు బిజెపికి, మోడీకి లొంగిపోయారని నారాయణ పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోటీ చేసేందుకు సిద్ధమంటున్నారు.

బిజెపి చెప్పేది పూజలు, చేసేవి బెదిరింపు రాజకీయాలన్నారు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులను బెదిరించి బిజెపి తన దారికి తెచ్చుకుంటుంది అన్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న బిజెపికి 400 సీట్లు ఎలా వస్తాయి..? వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ నమ్ముకున్నారేమో.. ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలని బిజెపి ప్రయత్నం చేస్తుంది. అందుకే అరవింద్ క్రేజ్ వాల్ లాంటి   నాయకుడిని కూడా బిజెపి తన గుప్పిట్లో  బంధించింది. జాతీయస్థాయిలో ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం.. ఇండియా కూటమితో పని చేస్తాం.  రాష్ట్రంలో మోడీ అడుగులకు జగన్,  చంద్రబాబు మడుగులు పడుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ, టిడిపిలకు వ్యతిరేకంగా పోటీ చేస్తామన్నారు సిపిఐ నారాయణ. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కూటమితో ఎన్నికల్లో బరిలోకి దిగుతామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news