సెప్టెంబర్ 1న చలో విజయవాడకు పిలుపునిచ్చిన సిపిఎస్ ఉద్యోగులు

-

మంత్రి బొత్స సత్యనారాయణ తో సిపిఎస్ ఉద్యోగుల చర్చలు ముగిశాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని సిపిఎస్ ఉద్యోగులు వెల్లడించారు. చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 1న ‘ చలో విజయవాడ” కు సంఘం నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని తమ దరికి తెచ్చుకొని డిమాండ్స్ సాధించుకోవాలంటే పోరాటం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

శాతవాహన కాలేజీ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సిపిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు. అయితే మరో దఫా చర్చలకు సిద్ధం కావాలని మంత్రులు సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలకు సూచించారు. మరో దఫా చర్చలు ఎప్పుడు అనేది వారు స్పష్టం చేయకపోవడం విశేషం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే సిపిఎస్ రద్దు కావడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న చలో విజయవాడతోో పాటు చలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news