మునుగోడులో షర్మిల పార్టీ అభ్యర్ధి ఫిక్స్…డ్యామేజ్ ఎవరికి?

-

తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి…ఏపీలో తన అన్న జగన్ పార్టీ వైసీపీని వదిలి…తెలంగాణకు వచ్చి షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి ప్రజల్లో తిరుగుతున్న విషయం తెలిసిందే…ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు…పాదయాత్ర ద్వారా కేసీఆర్ ప్రభుత్వం విధానాలని ఎండగడుతూ వస్తున్నారు. తీవ్ర స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. అయితే షర్మిల పార్టీని తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

అలాగే ఆ పార్టీలో చేరికలు కూడా లేవు…ఇక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడుస్తుంది తప్ప…షర్మిల పార్టీని ఎవరు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండదని తేలింది. కాకపోతే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వైఎస్సార్టీపీ ప్రభావం ఉంటుందని, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చీలుస్తుందని సర్వేల్లో తేలింది.

అయితే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని షర్మిల దాదాపు ఫిక్స్ అయినట్లు సమాచారం. అలాగే అభ్యర్ధి విషయంలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…కాంగ్రెస్ పార్టీలో ఎవరికైతే సీటు దక్కదో…వారిని పార్టీలోకి తీసుకుని సీటు ఇవ్వాలనేది షర్మిల ప్లాన్ గా ఉందని తెలిసింది. ఇక ఇది సాధ్యమో కాదో…భవిష్యత్ లో తెలుస్తోంది.

కానీ షర్మిల పార్టీ పోటీలో ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే నష్టమే. అసలే కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది..కోమటిరెడ్డి రాజగోపాల్ బీజేపీలోకి వెళ్ళడం పెద్ద దెబ్బ..ఇప్పుడు షర్మిల పార్టీ పోటీ చేస్తే కొన్ని ఓట్లు అయిన చీలతాయి. అదే సమయంలో షర్మిల పార్టీ వల్ల కోమటిరెడ్డికి సైతం కాస్త నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులనే కోమటిరెడ్డి చీల్చి బీజేపీలోకి తీసుకెళ్లారు. అలాగే రెడ్డి, ఎస్సీ వర్గాలు కోమటిరెడ్డి వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది..వారి ఓట్లని షర్మిల చీలిస్తే కోమటిరెడ్డికి సైతం కాస్త నష్టం జరగొచ్చు…మరి చూడాలి షర్మిల పార్టీ అసలు మునుగోడు బరిలో ఉంటుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news