తల్లితో అక్రమ సంబంధం..ఆమె కూతురుపై లైంగిక దాడి..చివరికి !

-

తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమె కూతురుతో కూడా రాసలీలలకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. ఈ దారుణమైన సంఘటన కృష్ణా జిల్లా మచిలీ పట్నంలో చోటు చేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళితే… మచిలీపట్నంలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు నిందితుడు. ఈ నేపథ్యంలోనే ఆమె కుమార్తె పై ఘాతుకానికి ఒడిగట్టాడు.

తండ్రి స్థానంలో ఉన్నసదరు వ్యక్తి…. పది నెలలుగా బాలిక పై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీంతో.. బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా గుర్తించిన బంధువులు.. ఆస్పత్రిలో చేర్పించగా.. ప్రభుత్వాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అవమాననీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్యాక్సీ డ్రైవర్‌ గా పని చేస్తున్న నిందితుడు సురేష్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలకలపూడి పోలీస్‌ స్టేషన్‌ లోకేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news