నేడు ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలు లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పెట్టకపోయినా కాపు నేస్తం అందిస్తున్నామని తెలిపారు. కాపులకు ప్రతి ఏటా వేయి కోట్ల బడ్జెట్ పెడతాను అన్న చంద్రబాబు కనీసం ఐదేళ్లలో 1500 కోట్లు కూడా ఇవ్వలేదని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో బటన్ నొక్కిన వెంటనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా మహిళల అకౌంట్లో డబ్బులు వెళ్లిపోతున్నాయి. కానీ చంద్రబాబు హయాంలో (DPT) పథకాలు జరిగేవని..DPT అంటే.. దోచుకో, పంచుకో, తినుకో అనే స్కీం ద్వారా జరిగేవని అన్నారు. చంద్రబాబు తన దుష్ట చతుష్యంతో, వీరికి తోడు దత్తపుత్రునితో కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. గతానికి, ఇప్పటికీ తేడా చూడాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని అన్నారు వైయస్ జగన్.