ఏలూర్ జిల్లాలోని అక్కి రెడ్డి గూడెం లో గల పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ ఘటనలో మరణించిన వారికి సీఎం వైఎస్ జగన్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. కాగ ఈ ప్రమాదంలో గాయ పడిన వారందరికీ మెరుగైన వైద్య సాయం అందించాలని సంబంధిత అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
అలాగే ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ను సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 5 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2 లక్షలు పరిహారం చెల్లిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదం ఘటన పూర్తి స్థాయి లో దర్యప్తు చేయాలని ఏలూర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కాగ ఏలూర్ లో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 గురు సజీవ దహనం అయ్యారు. అలాగే పలువురు కి తీవ్ర గాయాలు అయ్యాయి.