రూ. 2 వేల నోటు రద్దు వెనక దురుద్దేశం ఉందని విమర్శించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నేడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ నోట్ల రద్దుతో దొంగలు దొరలు అయ్యారని ఎద్దేవా చేశారు. నోట్ల మార్పిడికి ఎందుకు నాలుగు నెలల సమయం ఇచ్చారని ప్రశ్నించారు నారాయణ. బీరువాలో దాచుకున్న డబ్బుని ఆ సమయంలోపు దర్జాగా పర్సంటేజీకి మార్చుకుంటారని అన్నారు.
అలా వచ్చిన డబ్బుని రాబోయే ఎన్నికలలో బిజెపి ఖర్చు చేయబోతుందని ఆరోపించారు. మోడీకి అభివృద్ధిపై దృష్టి లేదని.. అవినీతిపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. మోడీని దించడానికి అన్ని రాజకీయ పక్షాలు ఏకం అవుతున్నాయన్నారు నారాయణ. ఏపీకి జగన్ కన్నా మోడీ ఎక్కువ ద్రోహం చేశాడని మండిపడ్డారు.