పింగాణీ కప్పుల్లో టీ, కాఫీలు తాగేస్తున్నారా..?

-

పింగాణీ కప్పుల్లో: మనం తినే ఆహారం మాత్రమే ముఖ్యం అని చాలా మంది అనుకుంటారు.. కానీ ఎందులో తింటున్నాం, ఎలా వండుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం.వండే పాత్రల గురించి ఎప్పుడూ డిస్కషన్‌ నడుస్తూనే ఉంటుంది. మనం ఉదయం లేవగానే.. టీ లేదా కాఫీ తాగుతుంటాం. దాదాపు అందరూ పింగాణీ కప్పుల్లోనే తాగుతారు.. గ్లాసుల్లో తాగేవాళ్లు చాలా అరుదు. సెరామిక్ కప్పులలో కాఫీ, టీలను తాగుతుంటారు. కానీ అలాంటి కప్పులలో మీరు కాఫీ తాగుతున్నట్లయితే మీరు అనారోగ్యాల బారిన పడినట్లేనని నిపుణులు తెలియజేస్తున్నారు. అస్సాం యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

 

పింగాణీ పాత్రలు లేదా కప్పుల్లో వేడి ద్రవాలను పోసినప్పుడు వాటిల్లో ఉండే తగరం, సీసం ఆ ద్రవాల్లో కరుగుతాయి. దీంతో అవి మన ఆరోగ్యానికి హాని కలగజేస్తాయి. అవి ఎంతో ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు. సిరామిక్ పాత్రల తయారీలో భాగంగా సీసం, తగరం ఉపయోగిస్తుంటారు. దీని వల్ల అవి కరిగి మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో చేరి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని నిపుణులు చెబున్నారు. ఇలా కప్పులలో పాలు లేదా కాఫీ, టీ లను తాగడం వల్ల పిల్లలు, బాలింతలు, గర్భిణీలు అధికంగా అనారోగ్యాల బారిన పడుతున్నారని, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.

సైంటిస్టులు చేప‌ట్టిన ఈ అధ్య‌య‌నం ప్రకారం.. పింగాణీ పాత్ర‌లు లేదా క‌ప్పుల‌న్నీ హానిక‌రం కావు. క‌నుక వాటిని కొనే ముందు ప‌రిశీలించ‌డం మంచిది. బ్రాండెడ్ కంపెనీల‌కు చెందిన క‌ప్పుల‌ను వాడితే ఎలాంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. నాసిర‌కం పింగాణీ క‌ప్పుల్లో సీసం మోతాదుకు మించి ఉంటుందని, దాంతో హాని క‌లుగుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

రోజూ కాఫీలు టీలు పింగాణీ కప్పుల్లో తాగుతూనే ఉంటారుగా.. వందకు నాలుగు అంటు అమ్మేవి తీసుకుని అనవసరం ఆరోగ్యాన్ని పాడు చేసుకోకకండి.

Read more RELATED
Recommended to you

Latest news