అంబటి రాంబాబుకు దేవినేని సవాల్‌..పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయ్‌ !

-

పోలవరం పనులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ మంత్రి అంబటి రాంబాబుకు దేవినేని ఉమ సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎవరేం అడిగినా ఇరిగేషన్ మంత్రి అంబటి రెండు చేతులు పైకెత్తి తనకేం తెలియదంటున్నాడని.. చేయాల్సిదంతా చేసేసి.. పోలవరం నిర్మాణం ఎప్పుడవుతుందో చెప్పలేం అని సీఎం జగన్ మంత్రి అంబటితో చెప్పిస్తున్నారని ఆగ్రహించారు దేవినేని ఉమా. పోలవరం సందర్శనకు వెళ్లిన గోబెల్స్ మంత్రికి ఇప్పుడే వాస్తవాలు అర్థమయ్యాయా? డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తమ చేతుల్లో లేదంటున్న మంత్రి, గతంలో ఎమ్మెల్యేల కమిటీలో సభ్యుడిగా ప్రాజెక్ట్ వద్దకు వెళ్లినప్పుడు టీడీపీ ప్రభుత్వంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణమే జరగలేదని ఎలా అన్నారు..? అని ఆగ్రహించారు.

టీడీపీ హాయాంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగలేదన్న రాంబాబు.. 2019-20లో అది దెబ్బతిన్నదని ఎలా చెప్పాడు..? సీఎం జగన్ వైఖరితో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమే ప్రశ్నార్థకమైందని ఆగ్రహించారు.డయాఫ్రమ్ వాల్ సహా పోలవరం పనులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా..? 36 నెలల పాలనలో ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ రివ్యూల వివరాలు, పనుల వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? అని ప్రశ్నించారు.

నిర్వాసితులు సొమ్ముని వైసీపీ వారే పందికొక్కుల్లా దిగమింగుతున్నా సీఎం, మంత్రి ఎందుకు నోరెత్తడం లేదు? సీఎం జగనుకు దమ్ము, ధైర్యం ఉంటే 2010-11 సంవత్సరాలకు సంబంధించిన పీపీఏ మినిట్స్ గానీ, తరువాత ఆగస్ట్ లో జరిగిన పీపీఏ సమావేశం మినిట్స్ తక్షణమే బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి జగన్ మూర్ఖపు, అహంకారపూరిత నిర్ణయాలే కారణమని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news