తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఈరోజు వరంగల్ లో రాహుల్ గాంధీ సభకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 7న రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన ఉండగా… వీసీ అంగీకరించకపోవడంతో దాదాపుగా ఈ పర్యటన వాయిదా పడినట్లే. తాాజాగా చంచల్ గూడ జైల్ లో ఉన్న ఎన్ ఎస్ యూ ఐ నేతల ములాఖత్ కు కూడా జైల్ సూపరింటెండెంట్ అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆందోళన చేస్తున్న ఎన్ ఎస్ యూ ఐ నేతలను రాష్ట్ర అధ్యక్షుడు వెంకటన్ ను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరిని పరామర్శించడానికి రాహుల్ గాంధీ ప్రోగ్రాం ఫిక్స్ చేయాలని టీపీసీసీ కసరత్తు చేస్తోంది. దీని కోసం ఇప్పటికే జైలు అధికారులకు, పోలీసు అధికారులకు ములాఖత్ అనుమతి కోసం దరఖాస్తు చేశారు. ఇదిలా ఉంటే ఎన్ ఎస్ యూ ఐ నేతలతో రాహుల్ ములాఖత్ కు చంచల్ గూడ అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
కాంగ్రెస్ కు చుక్కెదురు… ఎన్ ఎస్ యూ ఐ నేతలతో రాహుల్ ములాఖత్ కు నో పర్మిషన్
-