సువర్ణావకాశం: కృష్ణదాస్ సూచనేదో బాగానే ఉంది బాబు!

-

అమరావతి ఉద్యమం 300 వందల రోజుకి చేరిన శుభసందర్భంగా.. చంద్రబాబుకు ఒక బంఫర్ ఆఫర్ ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. ఆ బంఫర్ ఆఫర్ కూడా చాలా అనుకూలంగా, సానుకూలంగా ఉంది అన్నది బలంగా వినిపిస్తున్న మాట. ఇంతకూ ఆ బంఫర్ ఆఫర్ ఏమిటి? అది బాబుకు సువర్ణావకాశం ఎలా అవుతుంది? నిన్నకాక మొన్న ఉపముఖ్యమంత్రి అయిన కృష్ణదాస్ కి ఉన్న నమ్మకం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

వైకాపా నేతలు చెబుతున్నట్లుగా కేవలం అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోని కొందరు వ్యక్తులు మాత్రమే అమరావతినే రాజధానిగా కోరుకోవడం లేదు.. మొత్తం రాష్ట్రం అంతా కోరుకుంటుంది అని బాబు చెబుతున్నారు! వైకాపా నేతలేమో ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖ పాలనా రాజధాని ప్లస్ అవుతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉపముఖ్యమంత్రిగా తాను తన పదవికి రాజినామా చేస్తాను.. మాజీ ముఖ్యమంత్రి గా చంద్రబాబు తనపై పోటీ చేయాలి అని కోరుతున్నారు కృష్ణ దాస్!

అలా విశాఖ రాజధానితో ముడిపెట్టి ఎన్నికకు వెళ్లి ఆ అన్నికలో చంద్రబాబు గెలిస్తే… అప్పుడు అమరావతిని రాష్ట్రం మొత్తం కోరుకుంటుంది అని వైకాపా నేతలు ఒప్పుకుంటారంట! అలాకానిపక్షంలో బాబు ఓడిపోతే… మూడు రాజధానుల విషయంలో మరో మాట మాట్లాడకూడదంట! దీంతో… ఇదేదో బాగానే ఉంది కదా అనేది నెటిజన్ల మాట! దీంతో ధమాన కృష్ణదాస్ సవాల్ కు బాబు స్పందించాలని.. అటు అమరావతిని కోరుకునేవారు, ఇటు విశాఖను కోరుకునేవారు కూడా బలంగా డిమాడ్ చేస్తున్నారు!

మరి ఈ విషయంలో బాబు అందుకు “సై” అంటారా? లేక ఈ సవాల్ తన చెవి వరకూ చేరలేదన్నట్లుగా సైలంట్ గా ఉంటారా? అన్నది వేచి చూడాలి!! వారన్నారు వీరాన్నారని కాదు కానీ… ఇది నిజంగా చంద్రబాబుకు, అమరావతిలోనే రాజధాని మొత్తం ఉండాలని కోరుకునేవారికి ఇది గొప్ప సువర్ణావకాశమని చెబుతున్నారు టీడీపీ కార్యకర్తలు!!

Read more RELATED
Recommended to you

Latest news