BREAKING : పవన్ కళ్యాణ్ దొంగ ఓటు నమోదు చేసుకున్నాడని వైసీపీ ప్రచారం చేస్తోంది. జనసేన కార్యాలయం చిరునామాతో పవన్ కళ్యాణ్ ఓటు నమోదు అయింది. గత ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు పరిధిలో ఓటు నమోదు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. 6 నెలల క్రితం చిరునామా మార్పు చేసుకున్నారు. ఓటు నమోదులో పార్టీ కార్యాలయం అడ్రస్ చెల్లుబాటుపై అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆర్డనరీ రెసిడెన్స్‌తోనే ఓటు నమోదుకు వీలు ఉంది.
అంటే హైకోర్టు తీర్పు ప్రకారం రోజూ రాత్రి నిద్రపోయే నివాసం అన్నమాట. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడప్పుడొచ్చే పవన్ ఎక్కువగా హోటల్‌లోనే బస చేస్తారు. తమ్ముడు బాటలోనే అన్న నాగేంద్రబాబు కూడా చేసుకున్నారని సమాచారం. వడ్డేశ్వరంలోని దొంగ చిరునామాతో ఓట్ల నమోదుకు విఫలయత్నం చేశారట. తెలంగాణలో పోలింగ్ ముగిసిన మరునాడే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారట.. అధికారుల తనిఖీలో దొంగ చిరునామాగా గుర్తించారని సమాచారం. నోటీసు ఇచ్చినా అధికారుల ముందు ఇంటి యజమానే హాజరు అయ్యారట. దాంతో నాగేంద్రబాబు సహా కుటుంబసభ్యుల ఆరు ఓట్లు తిరస్కరణకు గురైనట్లు సమాచారం.