కుప్పంలో చంద్రబాబుని మాజీ మంత్రి మోసం చేసారా…?

-

పంచాయతీ ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. కుప్పం నియోజకవర్గ పరిధిలో చాలా మంది నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం అలాగే పోటీ చేసే అభ్యర్థుల తో మాట్లాడే నాయకత్వం లేకపోవడం వంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అయితే కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ పంచాయతీలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం నాయకులు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఒక మాజీ మంత్రి గారి వల్లనే తాను ఓడిపోయాను అనే భావనలో చంద్రబాబునాయుడు ఉన్నారని రాజకీయవర్గాలకు సమాచారం అందింది. ఒక మాజీ మంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకోవడం తెలుగుదేశం పార్టీ లోటుపాట్లను అధికార పార్టీ నేతలకు వివరించడం తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఆయన కొన్ని సూచనలు చేయడం వంటివి ఎక్కువగా జరిగాయి. దీనితో కుప్పం పరిధిలో అధికార వైసీపీ ఎక్కువ స్థానాలు గెలిచింది.

దీనికి సంబంధించిన నివేదికలను కూడా చంద్రబాబు నాయుడు తెప్పించుకున్నారు. కొంత మంది సన్నిహితులు ద్వారా ఈ నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబునాయుడు కుప్పం నాయకత్వం మొత్తాన్ని మార్చకపోతే తాను ఓడిపోయినా సరే ఆశ్చర్యం లేదు అనే విషయాన్ని గ్రహించినట్టుగా తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు చేసే మార్పులు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఎమ్మెల్సీ శ్రీనివాసులు తీరుపై కూడా చంద్రబాబు నాయుడు చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news