బ్రిటన్ రాణి అధికారాలేంటో తెలుసా..?

-

బ్రిటన్ లో రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. బ్రిటన్ రాజ కుటుంబంలో ప్రస్తుతం ఎలిజబెత్-2 మహారాణిగా కొనసాగుతున్నారు. అయితే అప్పట్లో ఉన్న సార్వభౌమాధికారాలు ప్రస్తుతం రాజకుటుంభీకులకు లేవనే చెప్పవచ్చు. ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వంలో ఎలిజబెత్ కు ఉన్న అధికాలేంటో తెలుసా..? బ్రిటన్ రాజకీయం, పాలనలో ఆమె పాత్ర ఎంటో తెలుసుకుందాం రండి.

Queen Elizabeth_II
Queen Elizabeth_II

బ్రిటన్ లో రాచరిక పాలనతో పాటు ప్రభుత్వం కూడా ఉంది. ప్రజల గొంతుక వినిపించే పార్లమెంటులో ప్రజలచే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్), బ్రిటన్ రాణి నియమించిన వ్యక్తులు ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్)లో కొనసాగుతారు. పార్లమెంట్ వ్యవస్థలో మహారాణి కీలక పాత్ర పోషిస్తారు. దేశ ప్రధానితో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తారు.

ప్రస్తుతం బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 అంతర్జాతీయ వేదికలపై ఆ దేశ మొదటి ప్రతినిధిగా వ్యవహరిస్తారు. బ్రిటన్ కు ప్రధాని ఉన్నా.. ప్రభుత్వాధినేత్రిగా రాణి కొనసాగుతారు. రాష్ట్రంలో ఎన్నికలు కొనసాగితే.. పార్లమెంట్ లో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఆ పార్టీ తరఫున ఒకరిని ప్రధాన మంత్రిగా ఎంపిక చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దేశ పరిస్థితులపై, తదితర అంశాలపై తరచూ సమావేశమవుతారు. అయితే బహిరంగంగా మాత్రం రాజకీయాలపై రాణి చర్చలు నిర్వహించరు. ఎలాంటి నిర్ణయం తీసుకోరు.

ప్రభుత్వ ఏర్పాటు తర్వాత పార్లమెంట్ ను ప్రారంభించడం, ప్రభుత్వం కాలం ముగిసిన తర్వాత రద్దు చేసే హక్కు రాణి చేతిలోనే ఉంటుంది. పార్లమెంట్ సభల్లో ఏదైనా బిల్లులు ఆమోదం తెలిపినా.. రాణి ఆమోదం తప్పనిసరి. అప్పుడే బిల్లు చట్టబద్ధం అవుతుంది. హౌస్ ఆఫ్ లార్డ్స్ లో సభ్యులను నియమించే అధికారం రాణికి ఉంటుంది. క్వీన్ ఎలిజబెత్, ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఆ దేశ రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు. కానీ, వివిధ స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంటారు. ఏ దేశంపైనైనా యుద్ధం ప్రకటించే అధికారం రాణికి ఉంటుంది. కాకపోతే దానికంటే ముందు ప్రధాని, మంత్రులకు విషయం తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల నియామకం, అవార్డుల ప్రదానం చేయడం రాణి చేతుల్లోనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news