ఏపీ రేషన్‌ కార్డు దారులకు శుభవార్త..రేపటి నుంచే గోధుమ పిండి పంపిణీ

-

 

ఏపీ రేషన్‌ కార్డు దారులకు శుభవార్త.. పట్టణ ప్రాంతాల్లో రేపటి నుంచి రేషన్ షాపుల్లో దశలవారీగా గోధుమపిండి పంపిణీ చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం నుంచి దీన్ని ప్రారంభిస్తామన్నారు. చిరుధాన్యాలను ప్రోత్సహించేలా రాయలసీమలో పైలెట్ ప్రాజెక్టు కింద జొన్నలు, రాగులు అందిస్తామన్నారు.

చిరుధాన్యాల కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని… రైతుల నుంచి నాణ్యమైన ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇది ఇలా ఉండగా, మార్కెట్లో కేజీ టమాటా రూ.100 ఉండటంతో… రైతు బజార్లలో రూ. 50కే అమ్ముతామని ప్రభుత్వం ప్రకటించిన క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కేజీ టమాట రూ. 70కి అమ్ముతున్నారని వినియోగదారుడు ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు రైతు బజార్లలో పచ్చిమిర్చిని కేజీ రూ. 90 చొప్పున విక్రయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news