తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంత బాబు చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇస్తూ కలెక్టర్ కృతికా శుక్లా నియామక పత్రాన్ని సోమవారం అందజేశారు. అపర్ణా ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంహెచ్వో హనుమంతరావుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంత బాబు పై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా గత మూడు రోజుల క్రితం అనంత బాబు కు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.ఈ కేసు విచారణ జరుగుతుండగానే, అనంత బాబు బెయిల్ కోసం పిటిషన్ వేశారు.దీనిపై గతంలో రెండుసార్లు విచారణ వాయిదా వేసిన కోర్టు, తాజాగా బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.