మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ముగిసిన ఈడీ సోదాలు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ సమయంలో జరిగిన అవకతవకలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దాడులు నిర్వహించారు ఈడీ అధికారులు. ఢిల్లీ నుంచి వచ్చిన నాలుగు ఈడి బృందాలు ఎన్నారై ఆసుపత్రి, వైద్య కళాశాల, డైరెక్టర్ల నివాసాలు, వారికి సంబంధించిన న్యాయవాదుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో సోదరులు నిర్వహించారు.

అయితే ఈ సోదాలలో పలు కీలక డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా సాగుతున్న ఈ సోదాలు నేడు ముగిశాయి. దాదాపు 27 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. మూడు బ్యాగుల్లో పలు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను తీసుకువెళ్లారు ఈడీ అధికారులు. మెడికల్ కాలేజీ నుంచి 25 కోట్లను పక్కదారి పట్టించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.