ఎడిట్ నోట్ : రోజా మేడ‌మ్ న‌యా వెర్ష‌న్ విన్నారా ? వైసీపీ బైట్

-

ఒడిదొడుకుల రాజ‌కీయంలో
ఆమె ఓడి గెలిచారు
పెద్దాయ‌న పెద్దిరెడ్డి ఆశీస్సులు అందుకుని
పాత వైరం అంతా పోయింద‌ని చెప్పారు
త‌నదైన పంథాలో విప‌క్షాల‌కు వార్నింగ్ ఇవ్వ‌డ‌మే కాదు
ఇక‌పై పూర్తి స్థాయిలో రాజ‌కీయాల‌కే ప‌రిమితం అయి
వెండితెర బుల్లి తెర వెలుగుల‌కు దూరం అవుతాన‌ని కూడా చెప్పారు

నిన్న‌టి వేళ బాధ్య‌త‌లు అందుకున్న కొత్త మంత్రి రోజాకు శుభాకాంక్షలు  

మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ పూర్త‌య్యాక కొత్త గా పగ్గాలు అందుకుంటున్న అమాత్యులు ఒక్కొక్క‌రుగా మీడియా ముందుకు వ‌స్తూ త‌మ గొంతుక వినిపిస్తున్నారు. తమ వాద‌న వినిపిస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుతో స‌హా రోజా, విడ‌ద‌ల ర‌జ‌నీ బాధ్య‌త‌లు అందుకున్నారు. అదేవిధంగా జోగి ర‌మేశ్ కూడా త‌న పేషీ లో  బాధ్య‌త‌లు స్వీక‌రించి విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ క్ర‌మంలో తామేం చేయాల‌నుకుంటున్నామో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తూనే విప‌క్షాల‌ను టార్గెట్ చేశారు రోజా.
ఆ విధంగా మ‌రో మారు ఆమె హాట్ టాపిక్ అయ్యారు. ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ కు కేరాఫ్ అయిన ఆమె త‌న వంతుగా ఏంచేస్తానో చెప్పి అటుపై శాఖా ప‌ర‌మైన మార్పులు ఏంట‌న్న‌వి కూడా చెప్పి త‌మ‌ను  విమ‌ర్శిస్తూ పోతే బాగుండేంద‌ని టీడీపీ సొంత ప‌త్రిక చైత‌న్య ర‌థం (ఇ పేప‌ర్) లో వ్యాఖ్యానించారు. త‌నలో ఫైర్ త‌గ్గ‌లేద‌ని విప‌క్షాల‌కు చుక్కలు చూపిస్తాన‌ని అన్నారు.
కేవ‌లం విమ‌ర్శ‌లే కాదు
బాధ్య‌త‌లు కూడా ప్ర‌థ‌మావ‌ధిగా ఉండాలి
ఆ విధంగా త‌న‌కు అప్ప‌గించిన పనుల్లో
ఆమె నిమ‌గ్న‌మై ప‌ర్యాట‌క రంగానికి
బ్రాండ్ అంబాసిడ‌ర్ కావాల‌ని ఉత్త‌రాంధ్ర
ఎంతో ఆశిస్తోంది..
ఈ సీమ ఆడ‌పడుచుకు మ‌రిన్ని స‌వాళ్ల‌నూ అందిస్తోంది
ఇక రోజా శాఖ ప‌రంగా చేయాల్సిన మార్పులెన్నో ఉన్నాయి. ముఖ్యంగా ప‌ర్యాట‌కం ప‌రంగా విశాఖ కేంద్రంగా కొన్ని అభివృద్ధి ప‌నులు గ‌తంలో ఆ శాణు చూసిన అవంతి శ్రీ‌ను చేశారు. వాటిని కొన‌సాగించాలి. కొన్ని అర్ధంత‌రంగా ఆగిపోయాయి. అదేవిధంగా టీటీడీని ఒప్పించి జిల్లాలో ఆడిటోరియం ఏర్పాటు చేస్తే సాంస్కృతిక శాఖ త‌ర‌ఫున బాధ్య‌త‌లు చూస్తున్న రోజా సంబంధిత క‌ళాకారుల‌కు, సాహితీ వేత్త‌ల‌కు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. అంతేకాకుండా యువ‌జ‌న శాఖ‌ను చూస్తున్నారు క‌నుక జిల్లాకో స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ ను ఏర్పాటు చేస్తే వారికి ఓ ఊతం ల‌భిస్తుంది.ఆ  విధంగా రోజా మ‌రో మారు ఫైర్ బ్రాండ్  అని అనిపించుకోవాల‌ని ఆశిద్దాం.
స‌వాళ్లు మ‌రియు ప్ర‌తిస‌వాళ్లు
ఎలా ఉన్నా క‌న్నీటి తీరాల‌ను దాటి
వ‌చ్చిన వైనాన్ని రోజా మ‌రువ‌రు
అదేవిధంగా త‌న వైరి వ‌ర్గాల‌ను
దృష్టిలో ఉంచుకుని స‌మ‌ర్థ రీతిలో
ప‌ని చేసేందుకు త‌న‌ని తాను నిరూపించుకునేందుకు
వీలున్నంత మేర ప‌ర్యాట‌క రంగంలో పెట్టుబ‌డులు
ప్రోత్స‌హించేందుకు, ఆ విధంగా మెంటార్ షిప్ ను
ఎంపిక చేసుకునేందుకు ఆమె చేసే ప్ర‌తి ప్ర‌య‌త్న‌మూ
స‌ఫ‌లీకృతం కావాల‌ని ఆకాంక్షిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news