మరో నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని ఏపీ సీఎం జగన్ మేదరిమెట్ల సిద్ధం సభలో తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలున్నాయి. వీటితో పాటు బాబు జేబులో మరో జాతీయ పార్టీ ఉంది. వీరంతా మన భవిష్యత్ పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ ఓడించడానికి వాళ్లు చూస్తున్నారు. పేదలను గెలిపించడానికి నేను చూస్తున్నానని తెలిపారు.
పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనం.. చంద్రబాబుకు ఉన్నట్టు నాకు పది మంది స్టార్లు లేరు. స్టార్ క్యాంపెయినర్లు లేరు. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్న నాకు ఉన్నదల్లా ప్రజల బలమే అన్నారు సీఎం జగన్. ఫ్యాకెజీ ఇచ్చి దత్త పుత్రుడిని తెచ్చుకున్నాడు చంద్రబాబు. ఫ్యాకేజీ స్టార్ సైకిల్ దిగమంటే దిగుతాడు.. సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. టీడీపీ, జనసేన, బీజేపీ 2014లో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదు. మళ్లీ పొత్తుల డ్రామాతో ముందుకు వస్తున్నారని తెలిపారు సీఎం జగన్.