ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా చంద్రబాబు పరిస్థితి సున్నానే అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలో మాట్లాడారు సీఎం జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఈ ముగ్గురు 2014 ఎన్నికల్లో కూడా పొత్తులు పెట్టుకున్నారు. ఒకే ప్రకటనలు.. ఒకే హామీలు ఇచ్చారు. కానీ రాష్ట్రానికి చేసింది ఏమి లేదన్నారు. చంద్రబాబు నాయుడు సంతకం చేసి ఇంటింటికి పాంప్లెట్ పంపించారు. పాంప్లెట్ లో రైతులకు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తాను. డ్వాక్రా సంఘాల రుణాలను రద్దు చేస్తాం. మహిళల రక్షణ ఫోర్స్ ఏర్పాటు చేస్తాను.
ఇంటింటికి ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల జీతం. నిరుద్యోగ భృతి, అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా గృహాలు నిర్మిస్తాం. రాష్ట్రాన్ని సింగపూర్ సిటీలా డెవలప్ మెంట్ చేస్తాం అన్నారు. కానీ ఇవేవి చేయలేదు. వీరు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు సంతకం చేసి ప్రతీ ఇంటికి పాంప్లెట్ పంపించారు. 2014లో ఇచ్చిన హామీలు ఏమైనా అమలు అయ్యాయా..? అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో అమలు కానీ హామీలు పెట్టి.. చంద్రబాబు సంతకం పెట్టి ప్రతీ ఇంటికి పంపించి మరోసారి ఇలాగే మోసం చేస్తారని గుర్తు చేశారు.