ఏపీలో మళ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రకటన కూడా విడుదల అయింది. తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రకటన జారీ చేసింది ఏపీ ఎన్నికల సంఘం. ఈసీ ఆదేశాల మేరకు 2024 నవంబరు 1 తేదీనాటికి జాబితా రూపోందించేలా షెడ్యూలు విడుదల అయింది.
ఈ నెల 29 తేదీన ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషనుకు నోటిసు విడుదల చేయనుంది ఈసీ. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు 2024 సెప్టెంబరు 30 తేదీన నోటీసు విడుదల చేయనుంది ఎన్నికల సంఘం.
2024 డిసెంబరు 30 తేదీనాటికి తుది ఓటర్ల జాబితా రూపోందిస్తామని ప్రకటనలో పేర్కొంది సీఈఓ కార్యాలయం. ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుందని ప్రకటనలో వెల్లడించింది.