Telangana : నేడు బడ్జెట్‌పై ఉభయసభల్లో సాధారణ చర్చ

-

ఒక్క రోజు విరామం తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశం అవుతాయి. రెండు సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్‌ పద్దుపై చర్చకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి ఉభయ సభల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతుంది. ఆ తర్వాత తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇస్తారు. తొలుత అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన తర్వాత.. మండలిలోనూ భట్టి విక్రమార్క సమాధానం ఇస్తారు.

2 లక్షల 91వేల 159 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈనెల 25వ తేదీన పద్దును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులున్నా ప్రజల ఆకాంక్షలు, హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా తొలి పూర్తిస్థాయి పద్దును శాసనసభలో ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ పద్దులో ఆరు గ్యారంటీలకు సరైన కేటాయింపులు జరపలేదని, బడ్జెట్ అంతా అంకెల గారడీలా ఉందంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ఉభయ సభల్లో బడ్జెట్ చర్చ వాడివేడిగా సాగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news