విజయవాడలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చే బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై టిడిపి నేతలు అంతా నిరసించారు, ఆందోళనలు నిర్వహించారు. ఈ నిర్ణయంపై నందమూరి కుటుంబం స్పందించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. ఆ నిర్ణయాన్ని ఖండించారు.
ఇదే సమయంలో ఈ నిర్ణయం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్లు హోరెత్తాయి. ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు.. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని పేర్కొన్నారు. మరోవైపు ఎన్టీఆర్ గోడమీద పిల్లిలా వ్యవహరించారంటూ విమర్శలు కూడా వచ్చాయి.
తాజాగా అమరావతిని రాజధానిని చేయాలని రైతులు చేస్తున్న పాదయాత్రలో ఓ మహిళ యంగ్ టైగర్ ని బండ బూతులు తిట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” ఎన్టీఆర్ మనవడినని చెప్పుకుంటాడు. నువ్వు ఎన్టీఆర్ మనవడివైతే రా.. ముందుకు రా. మీ తాతను అవమానించినప్పుడు నువ్వు ఎందుకురా.. ఇక నువ్వు ఉంటే ఏంటి చస్తే ఏంటి? మేమే లోక్కొస్తాం టిడిపిని”. అని శాపనార్ధాలు పెట్టింది. ఈ వీడియోని వైయస్సార్సీపీ నేతలు షేర్ చేస్తున్నారు.
పెయిడ్ పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ని బండ బూతులు తిడుతున్న పచ్చ పెయిడ్ రైతులు pic.twitter.com/nOqAdI9NGR
— Rahul (@2024YCP) October 9, 2022