ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంఈఓ-1 పోస్టులను ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లకు చెందిన గ్రేడ్-2 HMలతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. హైకోర్టు తీర్పునకు లోబడి ఈ నియామకాలు ఉంటాయని వెల్లడించింది.
ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున సీనియారిటీ జాబితాను ఇవాల్టి కల్లా సిద్ధం చేసి… జూలై-2 నాటికి జాబితా ప్రకారం ఆప్షన్లు తీసుకోవాలని ఆర్జెడీలను ఆదేశించింది. 3న కొత్తపోస్టుల్లో చేరాలని సూచించింది. ఇది ఇలా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో రేపటి నుంచి రేషన్ షాపుల్లో దశలవారీగా గోధుమపిండి పంపిణీ చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.
పుంగనూరు నియోజకవర్గం నుంచి దీన్ని ప్రారంభిస్తామన్నారు. చిరుధాన్యాలను ప్రోత్సహించేలా రాయలసీమలో పైలెట్ ప్రాజెక్టు కింద జొన్నలు, రాగులు అందిస్తామన్నారు. చిరుధాన్యాల కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని… రైతుల నుంచి నాణ్యమైన ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు.