బ్రేకింగ్ : విజయవాడ‌లో భారీ అగ్నిప్రమాదం

-

స్వర్ణ ప్యాలస్ ఘటన మరువక విజయవాడలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హనుమాన్ పేట మెట్రో మార్ట్ కు చెందిన సరుకున గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్టు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది 12 గంటలుగా మంటలను అదుపు చేస్తున్నా అవి అదుపులోకి రాలేదు. లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రి 7 గంటలకే గోడౌన్ మూసివేసినట్టు చెబుతున్నారు.

fire

గోడౌన్ మూసివేసి ఉన్న నేపథ్యంలో ప్రాణ నష్టం తప్పినా భారీగా ఆస్తి నష్టం అయితే తప్పేలా లేదు. 25 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాధమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. గోడౌన్ లో ఫెవికాల్ సొల్యూషన్ స్టాక్ ఎక్కువ ఉండడంతో మంటలు అదుపులోకి రావడం లేదని చెబుతున్నారు. పాదరక్షకలు తయారీకి వాడే మిశ్రమాల స్టోరేజ్ గోడౌన్ అని అధికారులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news