ఏపీలోనూ ఫార్ములా ఈ – రేసింగ్ నిర్వహిస్తాం – మంత్రి అమర్నాథ్

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద గ్రాండ్ గా నిర్వహించిన ఈ – ఫార్ములా రేసింగ్ ముగిసింది. రేసింగ్ విజేతగా జిన్ ఎరిక్ నిలిచాడు. 2, 3 స్థానాలలో నిక్ క్యాసెడీ, సెబాస్టియన్ ఉన్నారు. రేసింగ్ చూసేందుకు సెలబ్రిటీలతో సహా పెద్ద ఎత్తున ప్రేక్షకులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకోవడంలో ఆంధ్ర ప్రజల పాత్ర కూడా ఉందన్నారు.

ఫార్ములా ఈ రేస్ మొదటిసారిగా తెలుగు నేలపై జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. తెలుగువారిని ఈ స్థాయికి తీసుకువెళ్లిన రేస్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లోను ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నామని చెప్పారు. తెలుగువారిగా పుట్టడం ఎంతో గర్వించదగ్గ విషయమని, అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరగడంలో తెలుగువారి కృషి ఉందన్నారు.