శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక నుంచి తిరుమలలో ఉచితంగా రొట్టెలు, చపాతీల పంపిణీ

-

శ్రీవారి భక్తులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇక నుంచి తిరుమలలో రొట్టెలు, చపాతీల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందిస్తామని.. భోజనంతో పాటు మూడు పూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు అందిస్తామని కీలక ప్రకటన చేశారు.

తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని..
ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు సమయం పడుతుందని వివరించారు. త్వరలోనే ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నామని.. ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రకటన చేశారు. ఏ సేవల ధరలను పెంచే ఆలోచన టిటిడికి లేదని… ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన ఇప్పట్లో లేదని తేల్చి చెప్పారు. ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగిందని.. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news