సద్దాం హుస్సేన్, గాలి జనార్థన్ లాగా భవంతులు కట్టుకున్నాడు – గంటా శ్రీనివాస్

-

సద్దాం హుస్సేన్, గాలి జనార్థన్ లాగా భవంతులు కట్టుకున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ప్రజావేదిక నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని కూల్చివేసిన జగన్మోహన్ రెడ్డి…. రుషికొండ రాజమహల్ కు ఎటువంటి అనుమతులు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. న్యాయ స్థానాలకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చారు…500 కోట్లు ప్రజాధనం వృధా అయ్యిందని ఫైర్‌ అయ్యారు.

ganta srinivas slams jagan

సద్దాం హుస్సేన్, గా లి జనార్థన్ రెడ్డి వంటి వాళ్ళు భవంతులను తలదన్నే విధంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి…రుషికొండను విధ్వంసం చేసి గత ప్రభుత్వం రహస్యంగా రాజమహల్ నిర్మించిందని వివరంచారు. అత్యంత గోప్యంగా నిర్మాణాలు ఎందుకో అర్థం కాలేదు…దేశంలో ఇంతటి వివాదాస్పదమైన భవనం మరొకటి లేదన్నారు. CM క్యాంప్‌ కార్యాలయం అని ధైర్యంగా చెప్పే పరిస్థితి కూడా గత ప్రభుత్వంకు లేకుండా పోయిందని విమర్శలు చేశారు. రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించు కోవాలనేది ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news