పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఏపీ మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం పెట్టించేందుకు ఫైల్ తీసుకొచ్చారు శ్రీలక్ష్మి. అయితే…. ఇప్పుడు ఫైళ్లపై సంతకాల వంటివి వద్దంటూ శ్రీలక్ష్మిపై కసురుకున్నారట మంత్రి నారాయణ. రెండు రోజుల క్రితం శ్రీలక్ష్మిని తన పేషీ నుంచి బయటకు పంపేంచేశారు సీఎం చంద్రబాబు.
అటు శ్రీలక్ష్మి నుంచి బొకే తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించారు. జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దల ఆదేశాలు కూడా వచ్చాయి. ఆమెను బదిలీ చేసేంత వరకు ఆమెకు ఫైళ్లను పంపకూడదని భావిస్తోన్న చంద్రబాబు సర్కార్…వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పకనే చెబుతోంది.